బడి బాట కొత్త పుంతలు! | - | Sakshi
Sakshi News home page

బడి బాట కొత్త పుంతలు!

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● ప్రచారంలో సాంకేతికత వినియోగం ● ఏఐ పోస్టర్ల.. సామాజిక మాధ్యమాలు.. ● ఎన్‌రోల్‌మెంట్‌పై ఉపాధ్యాయుల కసరత్తు

ప్రస్తుత తరానికి అనుగుణంగా...

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్‌ అభ్యసనం ఆకట్టుకునే రీతిలో ఉంటోంది. పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్‌ ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడమే లక్ష్యంగా ప్రస్తుత తరానికి అనుగుణమైన రీతిలో స్థానిక కళాకారుల తోడ్పాటుతో పాఠశాల గురించి మా ఉపాధ్యాయ బృందం, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు పాల్గొని నటించిన పాటను రూపొందించాం. యూట్యూబ్‌లో విడుదల చేయడంతోపాటు స్థానిక గ్రామ వాట్సాప్‌ గ్రూపుల్లోనూ షేర్‌ చేశాం. మంచి స్పందన వస్తోంది. అడ్మిషన్లు పెరుగుతున్నాయి. – శారద, హెచ్‌ఎం,

ఎంపీపీఎస్‌, పొన్కల్‌

నిర్మల్‌ఖిల్లా: పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నడుస్తున్న బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. గతంలో గ్రామసభలు, మైకులు, కరపత్రాలకు మాత్రమే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు ఏఐ ఆధారిత పోస్టర్లు, వీడియోలు, డిజిటల్‌ ఫ్లెక్సీలు, సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా సాగుతోంది.

నాణ్యమైన విద్యను హైలెట్‌ చేస్తూ..

ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, పౌష్టికాహార మధ్యాహ్న భోజనాలు, విశాలమైన ఆటస్థలాలు, క్రీడా ప్రోత్సాహం, డిజిటల్‌ బోధ న, విలువల ఆధారిత అభ్యసనం, స్వేచ్ఛాయు త వాతావరణం వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇ ంటింటికి బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను కలుస్తున్నారు. గ్రామ పెద్దలు, సర్పంచులు, వార్డు సభ్యులు, విద్యా కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేసుకుంటూ విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తున్నారు.

వాట్సాప్‌ గ్రూపులతో అనుసంధానం..

ప్రతీ గ్రామంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్య ంలో తరగతివారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పా టు చేశారు. ఈ గ్రూపుల ద్వారా పాఠశాల కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభ, బోధన విధానా లు, విజయాలు, ప్రభుత్వ పథకాల వివరాలను తల్లిదండ్రులకు నిరంతరం చేరవేస్తున్నారు. విద్యార్థుల విజయాలు, అవార్డులను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రత్యేక గీతాలు, బ్యానర్లు..

మామడ మండలం పొన్కల్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక కళాకారుల సహకారంతో ప్రభుత్వ బడి ప్రాధాన్యతను తెలియజేసే ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేశారు. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ పొందుతోంది. పరిమండల్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, పరిసర గ్రా మాల్లో భారీ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పా టు చేశారు. వాటిలో డిజిటల్‌ విద్య, క్రీడలు, పౌష్టికాహారం, వి ద్యార్థుల విజయాలను ఆకర్షణీయంగా చూపుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికల ద్వారా కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇదే తరహాలో వాట్సా ప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.

మారిన ప్రచార ధోరణులు

ఇటీవలి కాలంలో సాంకేతికత వినియోగం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ ప్రచారం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ ఆధారిత పోస్టర్లు, వీడియోలు, విద్యార్థుల ఫొటోలతో రూపొందించిన సృజనాత్మక కంటెంట్‌ తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను తొలగించి, కొత్త నమ్మకాన్ని పెంపొందించడంలో ఈ విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయడంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement