నిర్మల్‌టౌన్: అర్జిదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు త్వరగా పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు.


