లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● జిల్లా జడ్జి శ్రీవాణి

● జిల్లా జడ్జి శ్రీవాణి

నిర్మల్‌టౌన్‌: పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి ఈనెల 20న నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా ప్రధాన కోర్టులో జడ్జీలతో కలిసి, లోక్‌ అదాలత్‌పై న్యాయవాదులతో సోమవారం సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్‌ అదాలత్‌ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 20న జిల్లాలోని కోర్టులలో లోక్‌అదాలత్‌ జరుగుతుందని తెలిపారు. రాజీ పద్ధతిలో క్రిమినల్‌, సివిల్‌ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్‌ బౌన్స్‌ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రెటరీ రాధిక, నిర్మల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శుభకరణ్‌ , కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement