కుభీర్: కుభీర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లను కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన అధికారులు, రైతులతో మాట్లాడారు. టోకెన్లు సెప్టెంబర్ వరకు ఇచ్చారని, అప్పటి వరకు ఎందు కు వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతీరోజు 30 లారీలు వచ్చేలా చూస్తానన్నారు. తమ వెలిముద్రలు పడడం లేదన వృద్ధ రైతులు తెలుపగా డీఎంతో మాట్లాడతానని చెప్పారు. అంత కు ముందు ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. ఇరుకుగా ఉన్న మురికి కాల్వను పరిశీలించి మురికి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అస్పత్రిలో వైద్యులతో మాట్లాడారు. ప్రహ రీ కావాలని వైద్యులు కలెక్టర్‌ను కోరారు. తర్వాత కస్తూరిబాగాంధీ పాఠశాలను సందర్శించారు. వి ద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. కలెక్ట ర్ వెంట భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్‌రావుపటేల్, కుభీర్ చైర్మన్ కళ్యాణ్, ఆత్మా చైర్మన్ వివేక్, సర్పంచ్ కందుర్ సాయినాథ్, డీఈవో భోజన్న, ఐకేపీ డీఎం భోజరాం, వైద్యుడు ఆర్.విజేష్, ఏపీఎం దత్తాత్రి, సీసీ భూమన్న, ప్రిన్సిపాల్ వాణి ఉన్నారు.
ఉద్యానవన పంటల సాగు పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి ఉద్యానవన పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభాలు పొందుతారని తెలిపారు. ఈమేరకు వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఏవో అంజిప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, అధికారులు, పాల్గొన్నారు.


