అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

దిలావర్‌పూర్‌: ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నానని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. దిలావర్‌పూర్‌తోపాటు, మాయాపూర్‌, న్యూలోలం గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. దిలావర్‌పూర్‌ రూ.50 లక్షలతో ఎస్‌హెచ్‌జీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.36 లక్షలతో మూడు అంగన్‌వాడీ భనాల నిర్మాణానికి, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.10 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కేజీబీవీ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వడ్డపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే న్యూలోలంలో రూ.40 లక్షల వ్యయంతో ప్లాస్టిక్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దిలావర్‌పూర్‌లో రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో రైతులకు రాయితీపై జీలుగ అందజేశారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు నోట్‌ పుస్తకాలు అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు డి.ముత్యంరెడ్డి, దిలావర్‌పూర్‌ సర్పంచ్‌ అక్షర అనిల్‌, మాయాపూర్‌ సర్పంచ్‌ యార రమ్య, న్యూలోలం సర్పంచ్‌ సూర శ్రీలత, నాయకులు నిరంజన్‌రెడ్డి, ధనె నర్సయ, గంగారెడ్డి, మల్లేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement