మూత‘బడి’ తెరుచుకుంది | - | Sakshi
Sakshi News home page

మూత‘బడి’ తెరుచుకుంది

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

సారంగపూర్‌: మండలంలోని గొడిసెర ప్రాథమిక పాఠశాల గతేడాది విద్యార్థులు లేక మూతబడింది. సోమవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది సర్పంచ్‌ గోదావరి చొరవతో తిరిగి సోమవారం పునఃప్రారంభించారు. సర్పంచ్‌, ఎంఈవో మహేందర్‌ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ఊరిబడిని సంరక్షించుకుంటేనే అందరికీ మేలని పేర్కొన్నారు. గ్రామ ప్రజల బలమైన కోరిక, నాయకుల కృషితో పాఠశాల తిరిగి ప్రారంభమైందన్నారు. ఇందుకు కృషి చేసిన నాయకులు, గ్రామస్తులను అభినంధించారు. కార్యక్రమంలో గ్రామస్తులు సూర్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాస్‌, వార్డు సభ్యురాలు యార లత, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

రేపు కార్గో వస్తువులు వేలం

నిర్మల్‌టౌన్‌: ఆర్టీసీ నిర్మల్‌ డిపో కార్గోలో తీసుకెళ్లని వస్తువులను ఈ నెల 17న వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్‌ కె.పండరి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు వేలంలో పాల్గొనాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement