స్కూల్‌ బస్సుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సుల తనిఖీ

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

నిర్మల్‌టౌన్‌: ఆర్టీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం నిర్మల, భైంసా పట్టణాల్లో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల ఫిట్‌నెస్‌, డ్రైవర్ల లైసెన్సులు, వాహన బీమా, అత్యవసర ద్వారాలు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. నిర్మల్‌లో 2 బస్సులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కేసు బుక్‌ చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సుల భద్రతపై అవగాహన ఉండాలని సూచించారు. ఏఎంవీఐ అసిఫ్‌, ఆర్టీఏ సిబ్బంది కై లాష్‌, నరేశ్‌ ఉన్నారు.

భైంసాలో రెండు బస్సులు ..

భైంసాటౌన్‌: పట్టణంలో ఆర్టీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన బస్సుల ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాలు, తదితర అంశాలు పరిశీలించారు. మొత్తం 12 బస్సులు తనిఖీ చేయగా, రెండు బస్సులకు సంబంధించి సరైన ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ట్యాక్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర ధ్రువపత్రాలు లేకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు ఏఎంవీఐ రజనీకాంత్‌ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది కార్తీక్‌, లిఖిత్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement