చదువునే నమ్ముకుని.. | - | Sakshi
Sakshi News home page

చదువునే నమ్ముకుని..

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

దిలావర్‌పూర్‌ మండలం లోలం గ్రామానికి చెందిన డాక్టర్‌ వెల్మల మధు ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డీఎల్‌ పరీక్షలో ఎందర్నో వెనక్కినెట్టి ఉద్యోగం సంపాదించుకున్నారు. చదువును నమ్ముకునే ఇవ్వాళ జీవితంలో ఉన్నతస్థానంలో ఉన్నారు. ఒకప్పుడు ఇంటర్‌లో పరీక్ష తప్పారు. డిగ్రీలోనూ ముందుకెళ్లలేకపోయారు. ప్రైవేటుగా చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూనే చదువును కొనసాగించారు. వృక్షశాస్త్రంలో పీహెచ్డీతోపాటు ఎంఈడీ కూడా పూర్తిచేశారు. పాఠ్యపుస్తకాల రచనల్లో, అనేక పరిశోధన పత్రాల సమర్పణలో నిత్యవిద్యార్థిగా ఉంటూ తన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement