న్యూస్‌రీల్
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరబాద్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో భక్తులు భారీగా వచ్చారని అధికారులు తెలిపారు. ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమయంలో భారీగా గాలివాన రావడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.
ఆదివారం ఆటవిడుపు
పాఠశాలల వేసవి సెలవులు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు నిర్మల్ పట్టణంలో చిన్నారులు ఆట పాటలతో ఎంజాయ్ చేశారు. ఏఎన్.రెడ్డి కాలనీలో గ్రామీణ ఆటలు ఆడుతూ కనిపించారు. సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


