సారంగపూర్: మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జి ల్లా బోథ్ మండలం, అందూర్ గ్రామానికి చెందిన గోడం గంగాధర్, గోడం స్రవంతి త మ సమీప బందువుల ఖుషీ పండుగకు హా జరయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వా తావరణం మారింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. వీరి ద్దరూ వర్షంపడే సమయంలో తలదాచుకునేందుకు చెట్టునీడకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థాని కులు హుటాహుటిన 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రాజేందర్ తెలిపారు.
గాయపడ్డ గోడం స్రవంతి, గంగాధర్
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ భైంసా కమిటీ
భైంసాటౌన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ సాధారణ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బండారి సాయన్న, ఆదిలాబాద్ రీజినల్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీనివాస్, కార్యదర్శి అబిద్ పాషా ఆధ్వర్యంలో భైంసా డిపో కమిటీని ఎన్నుకున్నారు. భైంసా డిపో అధ్యక్షుడిగా కె.మల్లికార్జున్, సెక్రెటరీగా ఎ.గంగయ్య, చైర్మన్‌గా ఓ.రాజన్న, డిపో మహిళా అసిస్టెంట్ సెక్రెటరీగా సరోజన, జాయింట్ సెక్రెటరీగా నిరోష, గ్యారేజ్ సెక్రెటరీగా రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎ.మోహన్, గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది (గ్యారేజ్ సిబ్బంది)ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు.
హక్కుల కోసం మరో పోరాటం
నిర్మల్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాదిగలకు రావాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మాట్లాడారు. మాదిగలకి విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో దక్కాల్సిన వాటా కోసం మాదిగ హక్కుల దండోరా పోరాడుతుందని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్, దళిత డిక్లరేషన్ ప్రకారం మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని లెదర్ పార్కులన్నీ పునరుద్ధరించి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాదిగలకు అధిక స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ సమన్వయకర్త అందెల భవానీరెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు అడ్డుగా లక్ష్మణ్, సీనియర్ నాయకులు నల్లూరి ఆనంద్, బండారి అశోక్, శివకుమార్, మల్లెల కరుణాకర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


