వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
టమాట ధర ౖపైపెకి..
టమాటా ధరలు పెరుగుతుండటంతో సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా 25 కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది.
వ్యాపార సంస్థలు ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఇవి పట్టణాల్లో మున్సిపాలిటీలకు ఆదాయంగా మారాయి. ఇందుకోసం పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. విద్యుత్ తీగలు, స్తంభాలకు సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌తో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రోజూ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణవాసుల్లో టెన్షన్ పెరుగుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
ఖానాపూర్ రోడ్డు పక్కన


