జ్ఞాన వికాసానికి పుస్తకాలే పునాది. ఈ భావనతో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద ఉన్న విలువైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించి స్ఫూర్తిని కలిగించారు. పట్టణంలోని బాలాజీవాడకు చెందిన పూసల చంద్రశేఖర్. వీరు మచ్కల్‌గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాను వ్యక్తిగతంగా సేకరించిన కథా పుస్తకాలు, స్ఫూర్తిదాయక జీవిత గాధలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, నవలలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలను ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి విజయకు అందజేశారు.
– నిర్మల్‌ఖిల్లా


