ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం నాది మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. మా ఉపాధ్యాయులు నిరంతరం చదువుతూనే సమాజంలో గుర్తింపు పొందవచ్చని చెబుతూ ఉండేవారు. బడికి వెళ్లడం ద్వారా చదువుతోపాటు క్రమశిక్షణ సంస్కారం అరవడి ఎంతోమంది స్నేహితులవుతారు. పాఠశాల స్థాయిలో నేర్చుకునేది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నా ఉన్నతికి ప్రధాన కారణం మా మంజులాపూర్ పాఠశాల. ఇప్పుడున్న సౌకర్యాలు అప్పట్లో లేవు. కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేస్తాం.
– భోజన్న, డీఈవో


