రూ.15 కోట్ల పనులపై ఇరుపక్షాల వాదన
అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడొద్దు : వైస్‌చైర్మన్
ఏకపక్షంగా రద్దు సరికాదు : బీజేపీ కౌన్సిలర్లు
అడిషనల్ కలెక్టర్‌కు విపక్షం ఫిర్యాదు
నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేటాయించిన రూ.15 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనను కౌన్సిల్ సభ్యులు తీర్మానించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం పాలక, ప్రతిపక్షాల మధ్య మరోసారి వాదనకు వేదికై ంది. ఈసందర్భంగా వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడకుండా తమతో కలిసి రావా లన్నారు. పాలకవర్గం ప్రతీవార్డును అభివృద్ధి చే యాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తోందన్నారు. వార్డుల అవసరాల ప్రకారం నిధులు, పనులు కేటా యించామన్నారు. ప్రతిపక్ష సభ్యులు అవగాహన రహిత పనులు చేయవద్దని సూచించారు. తాము అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకుని పాలన సాగి స్తామని, వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
బీజేపీ కౌన్సిలర్‌ల ఆందోళన..
పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ.15 కోట్ల పనులకు గతంలోనే చేపట్టిన టెండర్లను ఏకపక్షంగా రద్దు చేసి, మళ్లీ కొత్తగా పనులకు ఆమోదం తెలుపడం అప్రజాస్వామికమని బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. సర్వసభ్య సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆందోళన చేశారు. సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కొత్త పనులపై తీర్మానం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఉనికి చాటుకోవడానికి ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. చైర్‌పర్సన్, కమిషనర్, డీఈఈ, ముఖ్య అధికారులు లేకుండా మేనేజర్‌తో వైస్‌చైర్మన్ ఈ సమావేశం నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిపారు. తమ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశ తీరుపై మేనేజర్ మారుతితో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ తీరుపై అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఇందులో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సాదం అరవింద్, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


