నిర్మల్‌చైన్‌గేట్: రాంజీ గోండ్ బలిదానం చరిత్రాత్మకమని నిర్మల్ గడ్డపై పోరాడి ప్రాణత్యాగం చేసిన వెయ్యి మంది వీరులను స్మరించుకోవాల ని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. రాంజీ గోండ్ వర్ధంతి పురస్కరించుకు ని జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్ సమీపంలో ఉన్న రాంజీ గోండు విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఏక కాలంలో ఆంగ్లేయులు, నిజాం పాలకులతో పోరాటం సాగించి, ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని ఈ నేలపై నడిపిన వీరుడు రాంజీగోండు అని అభివర్ణించారు. కా ర్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిసమ్మె రాజు, జిల్లా ఆఫీస్ సెక్రట రీ అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీ క్, సుంకరి సాయి, సీనియర్ నాయకులు అయ్యన్నగారి రాజేందర్, కందుల హరీశ్ పాల్గొన్నారు.


