అరైవ్‌ అలైవ్‌ వీక్‌ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అరైవ్‌ అలైవ్‌ వీక్‌ విజయవంతం చేయాలి

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా వచ్చే సోమవారం నుంచి ని ర్వహించే అరైవ్‌ అలైవ్‌ వీక్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్‌ అలైవ్‌ వీక్‌ నిర్వహణపై, సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణా లు కోల్పోతున్నారని తెలిపారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, అధికారులు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, రోడ్డు భద్రతపై ప్ర జలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడారు. ప్రజా పాల న – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి నిర్వహించే అరైవ్‌ అలైవ్‌ వీక్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 13న గ్రామీణ స్థాయిలో, గ్రామసభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజ ల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వారం రో జులు, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో ర్యాలీలు, మండలస్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ అరై వ్‌ అలైవ్‌ వీక్‌ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్‌, డీఈవో భోజన్న, డీఎంహెచ్‌వో రాజేందర్‌, జెడ్పీ సీఈవో శంకర్‌, డీసీఎస్‌వో రాజేందర్‌, డీపీఆర్వో విష్ణువర్ధన్‌, అధికారులు పాల్గొన్నారు.

ఎన్‌ఎంఆర్‌ కార్మికులకు

పనికి తగిన వేతనం ఇవ్వాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో పనిచేస్తున్న నామిన ల్‌ మస్టర్‌ రోల్‌(ఎన్‌ఎంఆర్‌) కార్మికులకు శ్రమకు తగిన వేతనం అందించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించా రు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో, గురువారం, ఎన్‌ఎంఆర్‌ వేజెస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా దినసరి కార్మికుల వేతనాల పెంపు గురించి చర్చించారు. 2024 – 25 సంవత్సరానికి 15 శాతం, 2025 – 26 సంవత్సరానికి 10 శాతం, 2026 – 27 సంవత్సరానికి 5 శాతం వేతనాలు పెంచారు. కార్మికుల శ్రమ కు తగిన వేతనం ఇవ్వడం ద్వారా వారిని గౌరవించినవారమవుతామని కలెక్టర్‌ తెలిపా రు. కార్మికులకు సంబంధిత వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంద ని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగు, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో శంకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, ఆర్‌ అండ్‌బీ అధికారి సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement