భైంసాటౌన్: నిరంతరం ప్రజాసమస్యలపై ప నిచేస్తూ బూత్‌స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం గురువారం నిర్వహించారు. ని యోజకవర్గంలోని 4 మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంస్థపై నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణా లు కలిగి ఉండాలన్నారు. భవిష్యత్ రాజకీ య, సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తలు తయారు కావాలని ఈ ప్రశిక్షణ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, అంత్యోదయ సూత్రం, సమాజంలోని చివరి వ్య క్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా పార్టీ కార్యకర్తలు పని చేయాల్సిన అవసరముందన్నా రు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, రవి పాండే, నగర్ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు గాలి రవి, రమేశ్, తాడేవార్ సాయినాథ్, పట్టణ అధ్యక్షుడు రాము పాల్గొన్నారు.


