నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ విద్యుత్ అర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డివిజ న్, సర్కిల్ కార్యాలయంలో చేపట్టిన నిరవది క దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేసి అర్హత ఉన్న కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలన్నారు. అన్ మ్యాన్‌డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని 2016 డిసెంబర్ 4 వరకు విలీనం కానీ కా ర్మికులను విలీనం చేయాలన్నారు. పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు.


