పోచమ్మ తల్లీ.. సల్లంగ చూడు
ఖానాపూర్: ఖానాపూర్ మండలం సుర్జాపూర్ నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవం ఆదివారం ముగిసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి బో నాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ మహిళలు ఊరేగింపుగా డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆలయానికి చేరుకున్నారు. చల్లంగ చూసు పోచమ్మ తల్లి అని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు తోకల బుచ్చన్నయాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలయానికి తరలివచ్చిన భక్తులు


