గుర్తుకొస్తున్నాయి..
లింగాపూర్ పాఠశాలలో 2010–11 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు
అబ్దుల్లాపూర్–కన్కాపూర్ పాఠశాలలో గురువులతో పూర్వ విద్యార్థులు
లోకేశ్వరం: వారంతా ఒకేపాఠశాలలో కలిసి చదువుకున్నారు. మైదానంలో నువ్వానేనా అంటూ క్రీడాల్లో పాల్గొన్నారు. చిలిపి చేష్టలతో ఉపాధ్యాయులతో బెత్తం దెబ్బలు తిన్నారు. చదువులోనూ పోటీపడ్డారు. పదో తరగతి తర్వాత అంతా దూరమయ్యారు. కానీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తాము చదువుకున్న బడికి చేరుకున్నారు. అంతరాల్లో తేడా ఉండోచ్చు.. ఉద్యోగం, జీవన విధానాల్లో తేడా ఉండొచ్చు.. కానీ, గడిచిన రోజులు మళ్లీ రావని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా రు. ఇందుకు లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్–కన్కాపూర్ ప్రభుత్వ పాఠశాల వేదికై ంది. 2011 –12 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. తమను ఉన్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మాంచారు. రోజంతా ఉత్సాహంగా గడిపారు. గురువులు బొడ్డు లక్ష్మణ్, రాజేశ్వర్, కాశీరాం, రాజారత్నం, దయాకర్, నగేశ్, వినయను సన్మానించారు.
లింగాపూర్ పాఠశాలలో..
కడెం: మండలంలోని లింగాపూర్ జెడ్పీ పాఠశాలలో 2010–11 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలలో కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆడిపాడారు.. రోజంతా ఉల్లాసంగా గడిపారు. గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
గుర్తుకొస్తున్నాయి..


