సమస్యలు పరిష్కరించండి
కడెం: మండలంలోని రాంపూర్ మైసంపేట్ పునరావాస గిరిజనులు పునరావాస పరిహారం, ఇతర సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, అటవీ అధికారులకు సోమవారం విన్నవించారు. గ్రామలను ఖాళీ చేసి 18 నెలలు గడిచినా నేటికీ సాగు భూముల పట్టాలు అందలేవని, సాగు భూములు చదును చేయలేదని, సాగునీరు, విద్యుత్‌సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని, మెయిన్ రోడ్డు నుంచి కాలనీ వరకు రోడ్డు నిర్మించాలన్నారు. కాలనీలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు. అధికారులను కలిసినవారిలో నర్సయ్య, ప్రవీణ్, దేవురావు, జైవంత్‌రావు, రాజం, బుచ్చవ్వ తదితరులు ఉన్నారు.


