పరిశీలించి.. పరిష్కరించండి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి ద రఖాస్తులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలు సుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడా రు. ప్రజావాణికి అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సమస్యల సత్వ ర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. పరిష్కా రం చేయకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి 52 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారులకు ఫీల్డ్ తప్పనిసరి..
అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఫీల్డ్ విజిట్లు నిరంతరం నిర్వహిస్తూ, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థపై పర్యవేక్షణ కఠినంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలును నిరంతరం పర్యేక్షించాలన్నారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించి జిల్లాలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి..
పట్టణంలోని వైఎస్సార్ కాలనీ, విశ్వనాథ్‌పేట పరిధిలో సుమారు 4 వేల జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థి కంగా వెనుకబడినవారే. ఈ ప్రాంతంలో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేవు. ఏ ఆరోగ్య సమస్య అయినా ప్రైవేటు లేదంటే జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. ప్రాథమిక ఆరో గ్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానా ఏర్పా టు చేయాలి. – ఎండీ.మిన్హజ్, వైఎస్సార్ కాలనీ
పరిశీలించి.. పరిష్కరించండి


