అనుభవం లేని వారితో సేవలు..
నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో నియమించబడిన వైద్యులు నిర్ణీత సమయానికి రాకపోవడం, హాజరైన కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోవడం లేదా విధులు సక్రమంగా నిర్వహించకపోవడం చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేని సమయంలో ఎస్‌ఆర్‌లతో సేవలు నిర్వహిస్తున్నారు. అ నుభవం లేని వారు అందిస్తే అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.
– సయ్యద్ హైదర్,
ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు
సర్టిఫికెట్ ఇప్పించాలి..
నా పేరు అఖిల, నా భర్త కుత్తుర రాజవెంకటేశ్ మే 11న రోడ్డు ప్రమాదంలో మరణించారు. నాకు ఒక కూతురు. నా భర్త చనిపోయిన తర్వాత డిపెండెంట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నా మరిది కలెక్టర్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. సర్టిఫికెట్ రాకుండా అడ్డుకుంటున్నాడు. – అఖిల, నిర్మల్
అనుభవం లేని వారితో సేవలు..


