సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు! | - | Sakshi
Sakshi News home page

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!

Nov 11 2025 7:23 AM | Updated on Nov 11 2025 7:23 AM

సన్నగ

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!

8లోu మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 ప్రకటన యాసంగి వడ్ల పైసలే ఇవ్వని ప్రభుత్వం వానాకాలం కొనుగోళ్లు షురూ.. ఈసారి ఇస్తారో లేదో అని అన్నదాతలో అనుమానం

నిర్మల్‌

అందెశ్రీ స్మరణలో ‘ఆదిలాబాద్‌’

అందెశ్రీ అస్తమయంతో ఉమ్మడి జిల్లా సాహితీవేత్తలు, కవులు, కళాకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటున్నారు.

పత్తి రైతుల ఆందోళన

భైంసాటౌన్‌: తేమ శాతం, నాణ్యత పేరిట సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని భగవతి కాటన్‌ జిన్నింగ్‌ మిల్లు వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ.. సీసీఐ సిబ్బంది, జిన్నింగ్‌ మిల్లు నిర్వాహకులు తేమ శాతం, కౌడి పేరిట రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు, దళారులు ఇష్టారీతిన నాణ్యత లేని పత్తి విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని, రైతులను నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నారని మిల్లు నిర్వహకులు, సీసీఐ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీసీఐ సిబ్బంది సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.

లక్ష్మణచాంద: జిల్లాలో వానాకాలం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కేంద్రం ఈ ఏడాది వడ్ల మద్దతు ధర స్వల్పంగా పెంచింది. గతేడాది క్వింటాల్‌ సాధారణ వరికి రూ.2,300, ‘ఏ’ గ్రేడ్‌ రకానికి రూ.2,320 చెల్లించింది. ఈసారి రూ.69 పెంచింది. సాధారణ రకానికి రూ.2,369, ‘ఏ’ గ్రేడ్‌ రకం రూ.2,389 చెల్లించనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నరకం ధాన్యానికి బోనస్‌ ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇస్తామని తెలిపింది. దీంతో గత వానాకాలం చాలా మంది రైతులు సన్న వడ్లు సాగు చేశారు. సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించింది. బోనస్‌ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో యాసంగిలో మరింత మంది సన్న వడ్లు సాగు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బోనస్‌ మాత్రం చెల్లించలేదు. ధాన్యం విక్రయించి ఐదు నెలలు గడిచినా బోనస్‌ ఊసే లేదు. మరోవైపు ఈ వానాకాలం కూడా చాలా మంది రైతులు సన్న వడ్లు సాగు చేశారు. ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు బోనస్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సీజన్‌కు సంబంధించిన జిల్లా రైతులకు రూ.12 కోట్లు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల్లో బోనస్‌ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

జిల్లాలో భారీ వరిసాగు

ఈ వానాకాలంలో జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సన్న రకాలే అధికంగా సాగు చేశారని వ్యవసాయ విభాగం అధికారులు తెలిపారు. పంట కోతలు మొదలు కావడంతో ధాన్యం సేకరణకు జిల్లా పౌరసరఫరాల శాఖ 317 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 1.69 లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కొన్ని కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరిస్తోంది.

బోనస్‌ వస్తుందంటున్న అధికారులు..

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ యాసంగి బోనస్‌ విడుదల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వానాకాలం ధాన్యానికి కూడా ప్రభుత్వం బోనస్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెదొద్దని సూచిస్తున్నారు. అయితే రైతులకు మాత్రం నమ్మకం కలుగడం లేదు. ఏ సీజన్‌ డబ్బులు ఆ సీజన్‌లో చెల్లిస్తేనే ఫలితం ఉంటుందని, ఐదారు నెలల తర్వాత చెల్లిస్తే ఏం లాభమని అంటున్నారు.

బోనస్‌ డబ్బులు త్వరగా వేయాలి

యాసంగిలో సన్న వడ్ల బోనస్‌ పైసలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇప్పుడు వానాకాలం వడ్లు కొంటున్నరు. బోనస్‌ డబ్బులు ఏ సీజన్‌కు సంబంధించినవి ఆ సీజన్‌లోనే చెల్లించాలి. ప్రభుత్వం వానాకాలం బోనస్‌పై ప్రకటన చేయలేదు. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి.

– సాయన్న, రైతు పొట్టపల్లి(కె)

ప్రభుత్వం సూచనల మేరకు చర్యలు

వానాకాలం సీజన్‌లో 1.69 మె ట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ కు 317 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. సన్నాలకు బో నస్‌పై ప్రభుత్వ ఆదేశాల మేర కు చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం.

– సుధాకర్‌, డీఎం, పౌరసరఫరాల శాఖ

ఈ రైతుపేరు బుర్రి భూమేశ్‌. లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామానికి చెందిన ఈ రైతు గత యాసంగిలో సన్న వడ్లు సాగుచేశాడు. 26 క్వింటాళ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. 26 క్వింటాళ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.13 వేల బోనస్‌ రావాలి. మద్దతు ధర రైతు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం.. బోనస్‌ డబ్బులు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. జిల్లాలో సన్నవడ్లు సాగుచేసిన రైతులందరి పరిస్థితి ఇదే.

జిల్లా వరి సాగు సమాచారం..

సాగు విస్తీర్ణం 1.20 లక్షల ఎకరాలు

కొనుగోలు కేంద్రాలు 317

సాధారణ రకం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,369

ఏ గ్రేడ్‌ ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389

ధాన్యం సేకరణ లక్ష్యం 1.69 మెట్రిక్‌ టన్నులు

యాసంగిలో రావాల్సిన బోనస్‌ డబ్బులురూ.12 కోట్లు

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!1
1/3

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!2
2/3

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!3
3/3

సన్నగిల్లుతున్న బోనస్‌ ఆశలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement