మైనర్ డ్రైవింగ్‌పై కొరడా
నిర్మల్‌టౌన్:ఇంటర్మీడియెట్‌స్థాయి విద్యార్థులతోపాటు పాఠశాల పిల్లలు సైతం బైక్‌లు, కార్లు నడపడం ఇప్పుడు సరదాగా మారింది. తమ పిల్లలు వాహనాలు నడపడం చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ, వాహనాలతో రోడ్లపైకి ఎక్కాక టీనేజర్లు హీరోయిజం చూపుతున్నారు. రయ్.. రయ్ మంటూ దూసుకుపోతున్నారు. విన్యాసాలు చేస్తున్నారు. కొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదు. దీంతో పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కొరడా ఝళిపిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వాహనాలతో రోడ్లపైకి వచ్చిన వారి ఆటకట్టించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు.
పోలీసులు సీరియస్
ఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో మేరకు పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్ చేసి, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమో దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
46 వాహనాలు సీజ్..
ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులు 46 వాహనాలను సీజ్ చేశారు. 70 మందికిపైగా తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మైనర్ల డ్రైవింగ్‌కు వాహనం యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మైనర్ల చేతుల్లో వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
మైనర్ డ్రైవింగ్ నేరం
మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. జిల్లాలో మైనర్ డ్రై వింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనా లు నడిపితే సీజ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్ చేసిన వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చే స్తాం. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదా లకు కారణం కావొద్దు. – జానకీషర్మిల, ఎస్పీ


