నిర్మల్
న్యూస్‌రీల్
బైక్‌లు నడుపుతూ హీరోయిజం చూపుతున్న టీనేజర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారంటున్న పోలీసులు పట్టుబడ్డవారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
ఒత్తిడి తట్టుకోలేక..!
ఇటీవల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, గృహిణులు ఇలా అన్నివర్గాలు, అన్నివయసులవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
లోకేశ్వరం: ఈ వర్షాకాలం వానలతో ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా పంటలు చేతికి వచ్చే సమయంలో మోంథా తుఫానుతో జిల్లాలో కుసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరిచేలు పూర్తిగా నేలవాలాయి. దీంతో పంటలు కోయడం భారంగా మారింది. ఇప్పటికే తెగుళ్లు, వర్షాలతో పెట్టుబడి పెరిగింది. వరణుడి దెబ్బతో మరింత భారం పడింది. పంటలు కోయాల్సిన సమయాన వర్షాలు కురవడంతో వరి పొలాలు నీట మునిగాయి.
నేల వాలిన పంటలు..
వర్షాకాలం ప్రారంభంలో కురిసిన చినుకులు రైతులకు ఆశ కలిగించాయి. ఆగస్టు సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో పంటలు పుష్టిగా పండాయి. అయితే అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. పెసర, మినుము, సోయా, చిక్కుడు, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు వరి పొలాలు నీటమునిగాయి. చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడటం రైతులు నష్టపోయారు. ఇప్పుడు పొలాలు కోయడం మరింత భారంగా మారింది.
యంత్రాలే ఆధారం..
వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో కూలీలతో పనులు కష్టంగా మారింది. మహిళా కూలీల కొరత, కూలి రేట్లు పెరగడం రైతులకు భారంగా మారింది. ఒక్కో మహిళా రైతుకు రోజు కూలీ రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. అయినా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. వర్షాలతో పొలాల్లో బురద ఉండడంతో సాధారణ యంత్రాలతో పంటలు కోసే పరిస్థితి లేదు. దీంతో చైన్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది. దీంతో యజమానులు అద్దె కూడా పెంచారు. గంటకు రూ.2,600 నుంచి రూ.3100 వరకు వసూలు చేస్తున్నారు. నీటితో తడిసిన పొలాల్లో యంత్రాలు నెమ్మదిగా పని చేయడంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చివరికి నష్టాలే..
ఆకాల వర్షాలతో నష్టం..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పంటలు పూర్తిగా నెలవాలాయి. పొట్ట దశ నుంచి వర్షాలు దంచి కొట్టడంతో పంటకు నష్టం జరిగింది. వరి పైరు వెన్ను విరిగి నెల వాలడంతో కోయడం కష్టంగా మారింది. యంత్రాలతో కోపించినా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. యంత్రాల చార్జీలు పెరిగాయి. – గిర్మాయి చిన్న దేవన్న, రైతు, కన్కాపూర్
మిషన్లకు పైసలు పోతున్నయి
నాకున్న ఆరు ఎకరాల్లో వరి పంట వేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలవాలింది. ఐదెకరాలు చైన్ మిషన్‌తో కోయించాను. గంటకు రూ.2,600 తీసుకున్నారు. నూర్పిడి చేసిన ధాన్యం తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వర్షాలకు పొలాలు చిత్తడిగా ఉండడంతో పెట్టుబడి మరింత పెరిగింది. – గీజ భోజన్న, రైతు, ధర్మోర
జిల్లాలో పంటల వారీగా సాగువిస్తీర్ణం..
వరి 1.40 లక్షల ఎకరాల్లో
పత్తి 1.57 లక్షల ఎకరాల్లో
సోయా 40 వేల ఎకరాల్లో
మొక్కజొన్న 15,371 ఎకరాల్లో
వానాకాలం పంటలపై రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసినా చేతికొచ్చే దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. వర్షాల కారణంగా పంట నష్టంతో అప్పులు, వడ్డీ భారాన్ని భరించాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రమ వృథా అవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరించకపోతే తమ కష్టం వర్షార్పణం అవుతోందని పేర్కొంటున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


