
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఆర్వోలు, ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ బృందాల విధులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిబంధనలు, ఎన్నికల సామగ్రి వినియోగం తదితర అంశాల గురించి వివరించారు. డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న తదితరులు పాల్గొన్నారు.