
దుబాయ్‌లో భైంసా వాసి మృతి
భైంసాటౌన్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన భైంసా వాసి అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్‌మాత నగర్‌కు చెందిన తుమ్మల శ్రీనివాస్(35) నెల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొద్దిరోజులకే మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరిగాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీని కుటుంబ సభ్యులు సంప్రదించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.