
కడెం ప్రధాన కాలువలో ఒకరి గల్లంతు
దస్తురాబాద్: కడెం ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన మైదం సురేందర్ అనే వ్యక్తి ఉదయం 10 గంటలకు కడెం ఎడమ కాలువలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా వరద ఉధృతికి మునిగిపోవడంతో అతని ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ విశ్వంబర్ పరిశీలించారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

కడెం ప్రధాన కాలువలో ఒకరి గల్లంతు