
బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ర్యాలీ
నిర్మల్ టౌన్: బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరి యా డీఈ శర్మన్ మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా టెలికాం సేవల విస్తరణలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో 04జీ సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు నెట్‌వర్క్ చేయలేని ప్రాంతాలు, గ్రామాల్లోనూ అధునాతన 4జీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగిందని, ప్రైవేట్ కంపెనీలకు దీటుగా నిలుస్తోందని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ప్రవీణ్‌కుమార్, అవినాష్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్, సతీశ్‌కుమార్, శర్మ తదితరులున్నారు.