విజయానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

విజయానికి ప్రతీక

Oct 2 2025 7:55 AM | Updated on Oct 2 2025 7:55 AM

విజయా

విజయానికి ప్రతీక

● నేడు దసరా పండుగ ● జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి ● వేడుకలకు ఆలయాలు ముస్తాబు గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

ఘనంగా ఆయుధపూజ

నిర్మల్‌టౌన్‌: దసరాను పురస్కరించుకుని జిల్లా సాయుధ కార్యాలయంలో బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జమ్మి చెట్టు, పోలీస్‌ వాహనాల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజ లందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపా రు. దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకో వాలని సూచించారు. అనంతరం సిబ్బందికి వి జయదశమి బోనస్‌ను స్వయంగా అందజేశా రు. కార్యక్రమంలో ఏఎస్పీలు అవినాష్‌ కుమార్‌, రాజేశ్‌ మీనా, సీఐలు ప్రవీణ్‌కుమార్‌, కృష్ణ, ఆర్‌ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌టౌన్‌: తెలుగు ప్రజలు జరుపుకొనే పండుగల్లో అతిపెద్దది దసరా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ పండుగను మహా సంబురంగా జరుపుకొంటారు. హిందూ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రా ముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, మహిషాసురుడిపై దుర్గామాత విజయం, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా నిర్వహించుకుంటారు. ఈ రోజు ఆయుధ పూజ, పొలిమేర దాటడం, జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం చేసుకునే ఆనవాయితీ అనాధిగా వస్తోంది. నేడు విజయదశమి దసరా సందర్భంగా ప్రత్యేక కథనం..

ఆయుధ పూజ: దసరా పండుగ రోజు నిర్వహించే ఆయుధ పూజ చాలా విశిష్టమైంది. ఉద్యోగలు, వ్యాపారాల్లో స్థిరపడ్డవారంతా ఈ పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రి, ముఖ్యమై న పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి ఆయు ధ పూజ నిర్వహిస్తారు.

పాలపిట్ట దర్శనం: దసరా వేడుకలు నిర్వహించిన అనంతరం పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూడడానికి గల ప్రత్యేకత ఏమిటంటే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనబడిందని, అప్పటినుంచి వారికి విజయాలు కలి గాయని అందరూ నమ్ముతారు. అందుకే విజ యదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్ట చూడడం ఆనవాయితీగా వస్తోంది.

జమ్మి చెట్టు పూజ: పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్తూ.. జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలు దాచి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడని.. ఆ యుద్ధంలో శత్రువులను జయించి విజయం పొందాడని చెబుతారు. అందుకే ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టును అప్పటినుంచి పవిత్రంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.

మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాట్లు

జిల్లా కేంద్రంలోని బంగాల్‌పేట్‌ మహాలక్ష్మి, నందిగుండం దుర్గామాత అమ్మవారి ఆలయాల ప్రాంగణాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో రావణ వధ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్థలం చదును చేయించారు. ఉత్సవాల నిర్వహణకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో వేదిక, లైటింగ్‌, టెంట్లు, బారికేడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. విశ్వహిందూ పరిషత్‌, బంగల్‌పేట్‌ ఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలతో అలంకరించారు. రావణుని బొమ్మ దహన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు అధికసంఖ్యలో హాజరవుతారు. మహాలక్ష్మి ఆల యం సమీపంలోని దసరా ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ ఆలయంతో పాటు నందిగుండం దుర్గామాత ఆలయం వద్ద దసరాను పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.

ప్రత్యేక కార్యక్రమాలు

దసరా వేడుకలు గురువారం సాయంత్రం 5గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రారంభిస్తారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ శమీపూజ చేస్తారు. ఆయుధ పూజను ఎస్పీ జానకీ షర్మిల నిర్వహిస్తారు. అనంతరం ఎ మ్మెల్యే రావణుని బొమ్మను దహనం చేస్తారు. స భాధ్యక్షుడిగా ముప్పిడి రవి వ్యవహరిస్తారు. భరతమాత పూజను విశ్వహిందూ పరిషత్‌ ఇందూరు వి భాగ్‌ ధర్మచర్య సంపర్క్‌ ప్రముఖ్‌ పతికే రాజేందర్‌ నిర్వహిస్తారు. దీనికి ముందు వీరంతా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

దసరా పండగను పురస్కరించుకుని బంగాల్‌పేట్‌ మహాలక్ష్మి అమ్మవారి ఆలయనికి వచ్చే భక్తులకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయం పక్కన గల గ్రౌండ్‌ చదును చేశాం. వాటర్‌, కరెంట్‌ సౌకర్యం కల్పించాం. టెంట్లు, బారికేడ్లు, వేదిక సిద్ధం చేశాం.

– జగదీశ్వర్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

విజయవంతం చేయాలి

బంగాల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయం నిర్మల్‌లోనే ప్రసిద్ధి గాంచింది. ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఆలయాన్ని శోభాయామనంగా ముస్తాబు చేశాం. భక్తులకు వసతులు కల్పించాం. భక్తులు అధికసంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలి.

– ముప్పిడి రవి,

వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు

విజయానికి ప్రతీక1
1/4

విజయానికి ప్రతీక

విజయానికి ప్రతీక2
2/4

విజయానికి ప్రతీక

విజయానికి ప్రతీక3
3/4

విజయానికి ప్రతీక

విజయానికి ప్రతీక4
4/4

విజయానికి ప్రతీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement