కడెం: మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలో మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన రొడ్డ చందు(35) కడెం వైపు నుంచి ధర్మాజీపేట్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ధర్మాజీపేట్ సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై సాయికిరణ్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.