
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కడెం: యువత ఉపాధి ఆవకాశలను అందిపుచ్చుకోవాలని డీఆర్వో ప్రకాశ్, హైటీకాస్ ప్రతినిధి వెంకట్ అన్నారు. మండలంలోని కల్లెడ గ్రామంలో హైటీకాస్, ప్రథమ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో నర్సింగ్, టైలరింగ్, కార్, బైక్ మెకానిక్, బ్యుటీషియన్ తదితర కోర్సుల్లో రెండు నెలలు ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తారని వివరించారు. శిక్షణ ఆనంతరం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి ఆవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీయువకులు 7288966422, 94410752,49 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవో సరిత, ప్రథమ్ ఫౌండేషన్ సిబ్బంది నరేశ్, హైటీకాస్ సిబ్బంది రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.