క్యాంపస్‌.. కావాలె.. | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌.. కావాలె..

Aug 2 2025 7:07 AM | Updated on Aug 2 2025 7:07 AM

క్యాం

క్యాంపస్‌.. కావాలె..

నిర్మల్‌
భవనం.. భయం భయం
జిల్లాలో ఏళ్లనాటి ప్రభుత్వ కార్యాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ఫోకస్‌.
అడెల్లి ఆలయానికి రూ.36.93 లక్షల ఆదాయం

శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025

9లోu

రిటైర్మెంట్‌ ఉద్యోగానికే..

ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: పోలీస్‌ రిటైర్మెంట్‌ కేవలం ఉద్యోగానికే కానీ, వ్యక్తిత్వానికి కాదని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన డీసీ ఆర్బీ ఎస్సై భాస్కరరావు, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గోపాలకృష్ణను జిల్లా కేంద్రంలోని ప్రధా న పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. వారు ఉద్యోగ నిర్వహణలో అంకితభా వంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. పోలీస్‌ శాఖ తరపున వారి కు టుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. శాఖ నుంచి రావాల్సి న అన్నిరకాల బెనిఫిట్స్‌ సకాలంలో అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్‌ అలీ, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌, ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నిర్మల్‌: చదువుల తల్లి కొలువైందన్న పేరే కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఉన్నతవిద్య అందని ద్రాక్షగానే ఉంది. నిర్మల్‌ కేంద్రంగా ఎడ్యుకేషన్‌ హబ్‌ చేస్తామని గత ప్రభుత్వం చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. పైగా.. జిల్లాలో ఉన్న పీజీ సెంటర్‌నూ నామ్‌కేవాస్తేగా మార్చేశారు. జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీ కావాలని అడిగితే.. ఇవ్వలేదు. మెడిసిన్‌ ఇచ్చినా అసౌకర్యాల మధ్యన చదువు సాగుతోంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలూ ఇంకెప్పుడొస్తాయన్న ప్రశ్న అలాగే ఉంది. ఇప్పటి ప్రభుత్వమూ దృష్టిపెట్టడం లేదు. ఇతర జిల్లాలో మాత్రం అదనంగా ఇంజినీరింగ్‌ కాలేజీలు వస్తున్నాయి. యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు పెడుతున్నారు. కానీ.. నిర్మల్‌ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఈక్రమంలో నిర్మల్‌ కేంద్రంగా బాసర జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ మళ్లీ పెరుగుతోంది. జిల్లాకు ప్రత్యేక క్యాంపస్‌ ఉండాలని, ఉద్యోగ, ఉపాధినిచ్చే కోర్సులు కావాలన్న వాదన బలపడుతోంది. ఈ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి వస్తోంది.

విద్యాఫలాలెక్కడ..!?

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక యూనివర్సిటీ లేదంటే పేరున్న కళాశాలలు ఉన్నాయి. కానీ.. నిర్మల్‌ ప్రాంతంవైపు అలాంటి ఒక్క వర్సిటీ లేదు. బాసరలో ఆర్జీయూకేటీ ఉన్నట్లే కానీ.. అందులో జిల్లా విద్యార్థులకు దక్కే సీట్లు నామమాత్రమే. ప్రత్యేక రాష్ట్రం, జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఈ ప్రాంతానికి విద్యాఫలాలు దక్కడం లేదన్న ఆవేదన నెలకొంది. పక్కనున్న నిజామాబాద్‌ జిల్లాకు తాజాగా ఇంజినీరింగ్‌ కాలేజీ, ఇటీవల నవోదయ కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్‌లోనూ ఇప్పటికే రెండు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండగా, అదనంగా హుస్నాబాద్‌లో మరో ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరు చేశారు. కానీ.. కనీసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఒక్కటంటే ఒక్క కాలేజీని కేటాయించకపోవడం శోచనీయం. నిర్మల్‌ కోసం అడిగిన జేఎన్‌టీయూను ఆదిలాబాద్‌కు కేటాయించినా.. అదీ కాగితాలకే పరిమితమైంది.

నిర్మల్‌లోని పీజీ కాలేజీ

సారంగపూర్‌: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయ 3 నెలల హుండీ ఆదాయాన్ని శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా భక్తుల సమక్షంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు ఆభరణాలు, కానుకలు, నగదు రూపంలో నమర్పించిన వాటిలో నగదు రూ.36,93,630 రూపాయలు, మిశ్రమ బంగారం 19 గ్రాములు, మిశ్రమ వెండి 3.8 కిలోలు సమకూరినట్లు ఇన్‌చార్జి ఈవో రమేశ్‌ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పరిశీలకులు భూమయ్య, ఆలయ చైర్మన్‌ భోజాగౌడ్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

ఉన్నతవిద్య.. ఇప్పటికీ అందని ద్రాక్షే

పైచదువులకు పట్నం పోవాల్సిందే

చదువుల దూరం.. తగ్గించాలని విన్నపం

మళ్లీ తెరపైకి జ్ఞానసరస్వతీ వర్సిటీ డిమాండ్‌

పైచదువులకు పట్నంకే..

‘ఏం నర్సయ్య.. ఏం సంగతి..! ఎక్కడుంది నీ బిడ్డ, ఏం చదువుతోంది..?’ అని అడిగితే.. ‘సార్‌.. ఇంటర్‌దాకా నిర్మల్‌ల సదివింది. ఇప్పుడు పట్నంల ఇంజినీరింగ్‌ సీటచ్చిందట. ఉన్న ఒక్క ఆడపిల్లను అంతదూరం పంపాలంటే ఇబ్బందిగనే ఉంది కానీ.. మన దగ్గర కాలేజీలు లేవు కదా సార్‌.. తప్పడం లేదు.’ అని నర్సయ్య నీరసంగా జవాబిస్తున్నాడు. ఒక్క నర్సయ్యకే కాదు.. ఎంతోమంది తల్లిదండ్రులు, వారి పిల్లలకూ పైచదువులంటే ఇప్పటికీ పరేషానే. ఇంజినీరింగ్‌ ఒక్కటే కాదు. కనీసం ఎంబీఏ, ఎంసీఏ, ఇతర పీజీ కోర్సులు చదువాలన్నా.. పుస్తకాలు, దుస్తులు సర్దుకుని, పట్నం బాట పట్టాల్సిందే.

జ్ఞానసరస్వతీ వర్సిటీ కావాలె..

‘నిర్మల్‌ ప్రాంతాన్ని ఉస్మానియా నుంచి కాకతీయకు, ఇప్పుడు కేయూ నుంచి తెలంగాణ వర్సిటీకి జిల్లాను మార్చడం కాదు.. నిర్మల్‌ జిల్లాకు ప్రత్యేక క్యాంపస్‌ కేటాయించాలి..’ అన్న డిమాండ్‌ పెరుగుతోంది. చదువులమ్మ బాసర జ్ఞానసరస్వతీ పేరిట ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయాలంటున్నారు.

గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ, శాతవాహన, పాలమూరు తదితర యూనివర్సిటీలన్నీ ఒకప్పుడు పీజీ సెంటర్లే.

పీజీ సెంటర్ల కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు.

నిర్మల్‌లో ఉన్న పీజీ సెంటర్‌నూ జ్ఞానసరస్వతీ యూనివర్సిటీగా మార్చాలని అప్పట్లో డిమాండ్‌ చేశారు.

కొత్త యూనివర్సిటీ చేయడం అటుంచి, ఉన్న పీజీ సెంటర్‌నూ నాశనం చేశారు.

ఒకవేళ కాకతీయ నుంచి తెలంగాణ వర్సిటీలోకి జిల్లాను(అఫ్లియేషన్‌) మార్చినా.. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉన్న సౌత్‌క్యాంపస్‌ తరహాలో నిర్మల్‌లో అన్నికోర్సులతో ‘జ్ఞానసరస్వతీ క్యాంపస్‌’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కూడా ఉంది.

క్యాంపస్‌.. కావాలె.. 1
1/2

క్యాంపస్‌.. కావాలె..

క్యాంపస్‌.. కావాలె.. 2
2/2

క్యాంపస్‌.. కావాలె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement