
ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట
దిలావర్‌పూర్: ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పే ర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. సిర్గాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద సిర్గాపూర్ నుంచి వయా కాల్వ తండా మీదుగా కాల్వ అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రూ.కోటి 91లక్షలతో చేపట్టిన రో డ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దిలావర్‌పూర్ పీహెచ్‌సీ పరిసరాల్లో రూ.16 లక్షలతో చేపట్టిన ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. దిలావర్‌పూర్ తండా నుంచి బన్సపల్లి వరకు రూ.2.56 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభు త్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్, నాయకులు రమణారెడ్డి, సుజాత మేర్వాన్, గంగవ్వ ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల దిలావర్‌పూర్‌లో అనారోగ్యంతో మరణించిన ఎనుగంటి ముత్తవ్వ, కుంట చిన్నయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.