
రిజర్వేషన్లు కల్పించాలి
నిర్మల్‌టౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు క ల్పించాలని నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అప్క గజేందర్ యాదవ్ డిమాండ్ చేశా రు. బుధవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి న సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల కో సం బీసీలంతా ఏకం కావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అనంతరం సమితి జిల్లా అధికార ప్రతినిధిగా జుట్టు వెంకటరమణ, ప్ర ధాన కార్యదర్శిగా నర్సయ్య, సెక్రటరీగా ముండాల పోశెట్టి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్‌ను ఏ కగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, సయ్యద్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.