
కాకతీయ.. ఇదేందయా?
నిర్మల్
సమస్యల్లో కుభీర్ పీహెచ్‌సీ
కుభీర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. కనీస వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.
● యూనివర్సిటీకి పట్టని జిల్లా ● కాలేజీ ఇక్కడ.. సార్లు అక్కడ ● కోర్సులనూ మార్చేసిన వైనం ● త్రిశంకుస్వర్గంలో పీజీ కళాశాల ● పట్టింపులేని పాలకులు, సార్లు ● విద్యార్థులకు అందని ఉన్నతవిద్య
అందరికీ ‘ఆధార్’ ఉండేలా చూడాలి
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
9లోu
సత్వర న్యాయం అందించాలి
భైంసాటౌన్: ఫిర్యాదుదారులకు సత్వర న్యా యం అందేలా చూడాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రతీ బుధవారం షీ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ తీరు పరిశీలించారు. చిన్నచి న్న తగాదాలతో విడిపోతున్న కుటుంబాల ను కౌన్సెలింగ్‌తో కలపడంలో షీటీం పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఏఎస్పీ అవినా ష్ కుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
నిర్మల్: ఎక్కడో వరంగల్‌లో ఉన్న కాకతీయ యూ నివర్సిటీ జిల్లాకు దూరభారమే. అయినా.. ఆ వర్సి టీకి జిల్లాపై కాసింత దయ కూడా లేదు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం.. అది కూడా చదువు ల తల్లి కొలువైన జిల్లాపై చిన్నచూపు చూస్తోంది. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువుల ఆశలు చిదిమేస్తోంది. ‘నీ జీవితానికి డిగ్రీ సరిపోతుందిలే. పీజీ సెంటర్ అవసరమా..!’ అన్నట్లుగా వెక్కిరిస్తోంది. పీజీ సెంటర్‌ను పెంచాల్సింది పోయి, ఇక్కడున్న కోర్సులనే మాయం చేసింది. కాలేజీని ఉత్తభవనంగా మార్చేసి పీజీ సెంటర్‌ను త్రిశంకుస్వర్గంలో పెట్టింది. ఇక్కడి ప్రజల అమాయకత్వమా? నా యకుల అవగాహన లోపమా? లేక పాలకుల నిర్లక్ష్యమా? ఏదైతేనేం.. మొత్తానికి జిల్లాలోని విద్యార్థు లను ఉన్నతవిద్యకు దూరం చేసింది.
1991లోనే పీజీ సెంటర్
చదువుల తల్లి కొలువుదీరి ఉన్నా.. విద్యాపరంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడి ఉండేది. పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్‌లోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండేవి. ఆ తర్వాత పైచదువులంటే నిజామాబాద్‌కో లేదా హైదరాబాద్‌కో వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్లే స్థోమత లేని ఎంతోమంది ఉత్తమ విద్యార్థులూ డిగ్రీతోనే చదువులు ఆపేసిన దాఖలాలున్నాయి. ఈక్రమంలో అప్పటి పాలకుల విన్నపం మేరకు ప్రభుత్వం నిర్మల్‌లో కాకతీయ యూనివర్సిటీ అనుబంధంగా నిర్మల్‌లో 1991లో పీజీ సెంటర్‌ను ప్రారంభించింది. ఎంఏ సోషియాలజీ, ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రాంత విద్యావ్యవస్థలో కొత్తదశ ప్రారంభమైంది. కానీ.. అది కొంతకాలమే అని అప్పట్లో స్థానికులు ఊహించలేకపోయారు.
కాలేజీ ఇక్కడ.. జీతాలక్కడ..
ప్రస్తుతం నిర్మల్ పీజీ కాలేజీలో సోషియాలజీ కో ర్సు ఉన్నా.. అది సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు కావడం, ఇక్కడ అధ్యాపకులూ లేకపోవడం, క్లాసులు జరగకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. తెలిసీతెలియక చేరే 10–15మందికి ఆన్‌లైన్ క్లాసులంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికీ నిర్మల్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకుల పేరుమీదుగానే వర్సిటీలో ఉంటూ వేతనాలు తీసుకుంటున్నారు.
అమాయకత్వమా.. అవగాహన లోపమా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకై క వర్సిటీ పీజీ సెంటర్ నాశనం కావడానికి స్థానిక ప్రజల అమాయకత్వంతోపాటు నాయకులు, పాలకుల అవగా హన లోపం, నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు విద్యావంతులు ఆరోపిస్తున్నారు. కళ్ల ముందే కోర్సులన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతూ చివరకు కాలేజీ భవనం మా త్రమే మిగలడాన్ని చూస్తూ ఉండిపోయారన్న వాదనలున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు పట్టించుకుంటే జిల్లాకు ఉన్నతవిద్య అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
న్యూస్‌రీల్
తిరిగి వర్సిటీ గూటికే..
నిర్మల్ పీజీసెంటర్‌లో రెగ్యులర్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను అప్పటి ప్రభుత్వం నియమించింది. వీరంతా స్థానికంగా ఉంటూ బాగానే పాఠాలు చెప్పారు. వర్సిటీ పరిధిలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు ఉండటంతో నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి నిర్మల్ పీజీ సెంటర్‌లో విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇక్కడి అధ్యాపకులంతా వరంగల్, సమీప ప్రాంతాల కు చెందినవారే ఉండేవారు. కేయూ క్యాంపస్‌లో పనిచేసే ప్రొఫెసర్లు రిటైర్డ్ అవుతున్న కొద్దీ నిర్మల్‌లో ఉన్న ఎంఏ ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ వరంగల్‌కు బదిలీ అ య్యారు. ఇక సోషియాలజీ కోర్సు క్యాంపస్‌లో లేకపోవడంతో ఇక్కడ పనిచేసే సదరు అధ్యాపకులకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఈక్రమంలోనే సోషియాలజీ ప్రొఫెసర్లంతా ఒక్కటై ఇక్కడున్న కోర్సును వరంగల్‌కు తరలించే కుట్ర చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ముందుగా హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సోషియాలజీ పీజీ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఆ సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సును రెగ్యులర్‌గా మార్చి, నిర్మల్ పీజీ సెంటర్‌లో ఉన్న రెగ్యులర్ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చేశారు. నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో రెగ్యులర్ ఫ్యాకల్టీ బోధించడానికి వీల్లేదంటూ వారంతా హన్మకొండ దారిపట్టారు. సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ వీసీగా ఉన్నప్పుడు సోషియాలజీ కోర్సును ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌కు షిఫ్ట్ చేశారు. ఇలా మొత్తం మీద.. నిర్మల్‌కు ఎంతో పేరు తీసుకువచ్చిన సోషియాలజీ కోర్సును తరలించడమే కాకుండా.. పీజీసెంటర్ భవిష్యత్‌నే నాశనం చేశారు.

కాకతీయ.. ఇదేందయా?