
ఆయిల్‌పామ్ సాగు.. ఆదాయం బాగు
● జిల్లాలో రైతులకు అవగాహన ● రాయితీపై మొక్కలు పంపిణీ ● నిర్వహణకు ఏటా రూ.4,200 ● ఆసక్తి చూపుతున్న అన్నదాతలు
భైంసాటౌన్: ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రో త్సహిస్తోంది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాగు వి ధానం, లాభాలు, నిర్వహణ, రాయితీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరిస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేసుకోవచ్చని ఉ ద్యానశాఖ అధికారులు తెలిపారు. వరి, సోయా, ప త్తి తదితర పంటలతో పోలిస్తే రెట్టింపు ఆదాయం ఖాయమని చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జించవచ్చని సూచిస్తున్నారు.
జిల్లాలో 8,200 ఎకరాల్లో సాగు
జిల్లాలో 8,200 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారు. 2022–2023 నుంచి సాగు ప్రారంభం కాగా, ప్రస్తుతం పలుచోట్ల పంట చేతికి వస్తోంది. ఇప్పటికే జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో పంట కోతకు వచ్చింది. 34 మంది రైతులు దిగుబడులు కూడా జిల్లాలో ఎనిమిది చోట్ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పంట విక్రయించిన ఐదురోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.7.35లక్షలు జ మ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈసారి జిల్లాలో మరో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు లక్ష్యం విధించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ పరిశ్రమ ఉంటే..
ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నా.. ఆశించిన స్థాయిలో రైతులు ఆసక్తి చూపడం లేదు. నాలుగేళ్ల తరువాత పంట కోతకు రావడం, స్థానికంగా ఆయిల్‌పామ్ పరిశ్రమ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వం జిల్లాకో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జిల్లాలోనూ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ కూడా చేశారు. కానీ, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఎక్కువ మంది రైతులు సాగుపై ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో సాగు వివరాలు
సాగు విస్తీర్ణం 8,200
రైతుల సంఖ్య 3,336
కొనుగోలు కేంద్రాలు 8
టన్ను గెలల ధర రూ.21వేలు
రైతులకు రాయితీలు
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఒక ఆయిల్‌పామ్ మొక్క రూ.20 చొప్పున ఎకరాకు 50 మొక్కలు అందిస్తోంది. ఎకరాకు ఒక్కసారి రూ.వెయ్యి పెట్టుబడి పెడితే నాలుగేళ్ల త ర్వాత పంట కోతకు వస్తుంది. అంతర పంటల సాగు, ఎరువుల కోసం ఎకరాకు ఏటా రూ.4,200 చొప్పున నాలుగేళ్ల దాకా ప్రభుత్వం ఇస్తోంది. ఇక బిందుసేద్యం పథకం కింద 80–100 శాతం రాయితీపై పరికరాలు అందజేస్తోంది. నర్సరీ వద్ద మొక్కల లోడింగ్ చార్జీలు కూడా కంపెనీ భరిస్తోంది. అక్క డి నుంచి మొక్కలు తెచ్చుకునే బాధ్యత రై తులదే. మొక్క నాటిన నుంచి తోటల పరి శీలన, అధిక దిగుబడి కోసం కంపెనీ ప్రతి నిధులు రైతులకు సలహాలు, సూచనలు ఇ స్తారు. ఎకరంలో వరి సాగయ్యే నీటితో 2.5 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చు.
సాగుపై అనుమానాలు వద్దు
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇతర పంటలతో పోలిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఎకరాకు అవసరమైన 50 మొక్కలను రూ.వెయ్యికే అందిస్తున్నాం. నిర్వహణ కోసం ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల దాకా ప్రభుత్వ అందించనుంది. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దిగుబడులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో వెంటవెంటనే డబ్బులు జమ చేస్తోంది. సాగుపై ఆసక్తి కలిగిన రైతులు ఏఈవోలు, ఏవోలు, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.
– బీవీ రమణ,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి