● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్షా సమావేశం ● దస్తూరాబాద్‌లో రేషన్‌కార్డుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్షా సమావేశం ● దస్తూరాబాద్‌లో రేషన్‌కార్డుల పంపిణీ

Jul 31 2025 6:54 AM | Updated on Jul 31 2025 9:00 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్షా సమావేశం

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్షా సమావేశం

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు తప్పనిసరి అని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలో ఆధార్‌ నమోదు ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధార్‌ లేని పిల్లల వివరాలు సేకరించి వారికి కార్డులు జారీ చేయాలని సూచించారు. శిశువులు పుట్టిన వెంటనే ఆస్పత్రుల యాజమాన్యాలు తల్లిదండ్రులు ఆధార్‌ నమోదు చే సుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అధిక జ నాభా కలిగిన పంచాయతీలను గుర్తించి ఆధార్‌ కేంద్రాల సంఖ్య పెంచాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో మెగా ఆధార్‌ సహాయక శి బిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపా రు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, యూఐడీఏఐ ఆర్వో ఆఫీస్‌ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శోభన్‌, ఎల్డీఎం రామ్‌గోపాల్‌, ఈడీఎం న దీం, పోస్టల్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంత అభివృద్ధికి మంజూరైన పనులు, లభించిన అటవీ అనుమతులు, చేపట్టిన పనుల పు రోగతి గురించి అధికారుల ద్వారా తెలుసుకుని ప లు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, డీఎఫ్‌వో నాగినిభా ను, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్‌అండ్‌బీ, అటవీ, రెవెన్యూశాఖల అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

రేషన్‌కార్డుల పంపిణీ

దస్తురాబాద్‌: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ బుధవారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. మండలానికి 1,352 నూతన రేషన్‌ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. అర్హులు రేషన్‌కా ర్డు కోసం ఎప్పడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, సీపీవో జీవరత్నం, ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, మండల ప్రత్యేకాధికారి నాగవర్ధన్‌, డీఎస్వో రా జేందర్‌, తహసీల్దార్‌ విశ్వంభర్‌, ఎంపీడీవో రమేశ్‌, ఎంపీవో రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement