ఉపాధ్యాయులకు తీపి కబురు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు తీపి కబురు

Jul 31 2025 6:54 AM | Updated on Jul 31 2025 9:00 AM

ఉపాధ్యాయులకు తీపి కబురు

ఉపాధ్యాయులకు తీపి కబురు

● జిల్లాలో 79 మందికి ప్రమోషన్లు ● నేడో.. రేపో షెడ్యూల్‌ విడుదల!

నిర్మల్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరోసారి ప్రమోషన్ల జాతరకు రంగం సిద్ధమవుతోంది. స్కూల్‌ అసిస్టెంట్‌లకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలు గా, ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. నేడో, రేపో షెడ్యూల్‌ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను జిల్లా అధికారులు ప్రకటించి, వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యంతరాలు స్వీకరించా రు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గజిటెడ్‌ హెచ్‌ఎంల పోస్టులు భర్తీ కానున్నాయి. ఆగస్టు 1 నాటికి జిల్లాలో ఖాళీ అయ్యే పోస్టుల ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో జిల్లాలో 23పీజీ హెచ్‌ఎం, 56స్కూల్‌ అసిస్టెంట్‌ పో స్టులు భర్తీ కానున్నట్లు అధికారులు తెలిపారు. పండిత, పీఈటీ పోస్టులనూ అప్‌గ్రేడ్‌ చేయనున్నారు.

జిల్లాలో 79 ఖాళీలు

జిల్లాలో 2,975 ఉపాధ్యాయ పోస్టులుండగా 2,323 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1వరకు 79 ఖాళీలు ఉండనున్నట్లు అధికారులు లెక్కలు తే ల్చారు. పీజీ హెచ్‌ఎం, పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులను 100శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్ల కోసం, మరో 30శాతం కొత్త నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 23మంది పీజీ హెచ్‌ఎంలు, 56మంది స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ లభించవచ్చని విద్యాశాఖ వర్గాల అంచనా. జిల్లాలో పీజీ హెచ్‌ఎం ప్రమోషన్‌ 23 మందికి దక్కనుండగా.. ఆ మేరకు అదనంగా మరి కొందరికి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు రానున్నాయి. ఒక్కో పోస్టుకు సీనియార్టీ ఆధారంగా ముగ్గురి పేర్లు సిద్ధం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడికి రెండు, మూ డు సబ్జెక్టుల్లో ప్రమోషన్‌ పొందేందుకు అర్హత ఉంటే.. ఒకదాన్ని మాత్రమే ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ప్రమోషన్లు ఇచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కొందరు ఆసక్తి చూపలేదు. మరి కొందరు ప్రమోషన్‌ పొందినా గడువులోపు చేరలేదు. ఇప్పుడు వారంతా సీనియార్టీ జాబితాలో ముందుంటారు.

కోర్టుకెళ్లే యోచనలో పీజీ హెచ్‌ఎంలు

ప్రమోషన్ల నిర్ణయం తీపి కబురే అయినా.. బదిలీలు లేని ప్రమోషన్లు ఏమాత్రం ఒప్పుకోబోమని పీజీ హెచ్‌ఎంలు స్పష్టం చేస్తున్నారు. గతేడాది పీజీ హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు పొంది దూరప్రాంతాల్లో పని చేస్తుండగా, మొదట బదిలీలు నిర్వహించి ఆ తర్వా తే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా రు. లేదంటే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వారు పే ర్కొంటున్నారు. కాగా, ప్రమోషన్లు కోరుకునే ఉపాధ్యాయులు ప్రభుత్వం విడుదల చేసే షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement