
ఎరువుల వివరాలు ప్రదర్శించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
మామడ: ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు రైతులకు తెలి సేలా స్టాక్ బోర్డులో ప్రదర్శించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మామడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల వివరాలను కంప్యూటర్‌లో పరిశీలించారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రశీదు పుస్తకాలను తనిఖీ చేశారు. దుకా ణంలో ఉన్న యూరియా, పురుగు మందుల ధరల వివరాలు నిర్వాహకులను అడిగి తెలు సుకున్నారు. గుర్తింపు పొందిన సంస్థలు తయా రు చేసిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు మాత్రమే రైతులకు విక్రయించాలన్నా రు. రైతులు వేసిన పంటలు, భూసారం ఆధారంగా ఎరువులను ఇవ్వాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని తెలిపారు.