
బాలాజీ.. యోగా గురూజీ
కుభీర్ మండల కేంద్రానికి చెందిన జంగిలి బాలాజీ 1996లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కానిస్టేబుల్‌గా చేసేవారు. ఒకరోజు ఆయన రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. పలుచోట్ల కాలు విరిగింది. తలలో రెండుచోట్ల రక్త గడ్డకట్టింది. మందులతో తగ్గకుంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ.. అప్పటికే తమ ఇచ్చోడ స్టేషన్ ఎస్సైగా చేసిన భీమన్న ప్రోద్బలంతో యోగా, ప్రాణాయామం నేర్చుకున్న బాలాజీ ఆపరేషన్‌కు ఒప్పుకోలేదు. నిత్యం.. యోగా, ప్రాణాయామంతోపాటు కపాలభాతి చేయడంతో ఏడాదిన్నర తర్వాత మళ్లీ తలకు చేయించిన స్కానింగ్‌లో రక్తం గడ్డకట్టిన(బ్లడ్‌క్లాట్) సమస్య కనిపించనే లేదు. అలా.. స్వయంగా తానే యోగసాధనతో కలిగిన ఫలితాన్ని అనుభవించిన బాలాజీ నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకున్నారు. దాదాపు 36 ఏళ్లుగా తాను యోగా చేయడం కాకుండా ఆసక్తితో వచ్చేవారికి నిత్యం ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ పోలీసు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్‌లోని వశిష్ట యోగాసంఘటన్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
నిత్యసాధనతో సత్ఫలితాలు..
యోగాను ప్రతిఒక్కరూ చేయొచ్చు. దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా నిత్యం జిల్లాకేంద్రంలో ఉచితంగా యోగా నేర్పుతుండటం సంతృప్తినిస్తోంది.
–జంగిలి బాలాజీ, క్లూస్‌టీమ్, నిర్మల్