నిలిచిన ధాన్యం తరలింపు
ఖానాపూర్: మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు ప్రక్రియ మూడు రోజులుగా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన లారీలను ఉన్నతాధికారులు రైస్‌మిల్లులకు ట్యాగ్ చేయకపోవడంతో ధాన్యం తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. వాతా వరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఖానాపూర్‌లో నూ వర్షం కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. హమాలీలు, గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి.
తూకంలో కోతపై ఆందోళన..
ఖానాపూర్: మండలంలోని రాజురా గ్రామంలో ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు క్వింటాల్‌కు 10 కిలోలు కోతకు అంగీకరిస్తేనే తూకం వేస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై రాజురా ఎక్స్‌రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మామడ పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడించారు. నిరసనలో రాజురా, బావాపూర్(ఆర్), చందునాయక్‌తండా తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.


