
జిల్లా కేంద్రంలోని ఓ కొబ్బరిబోండాల దుకాణం
● ఆరోగ్యానికి సైతం అన్నివిధాలా మేలు ● కొనుగోలుకు ప్రజల ఆసక్తి
నిర్మల్‌ఖిల్లా: వేసవికాలంలో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరిబోండాలు తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో జిల్లాలో కొబ్బరిబోండాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలసాగు తక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం తెల్ల వారుజామునే లారీల్లో జిల్లా కేంద్రానికి కొబ్బరి బొండాల లోడు చేరుకుంటుండగా, అక్కడి నుండి విక్రయదారులు టోకున కొనుగోలు చేసి రోజంతా రిటైల్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో లారీలో దా దాపు 7వేల వరకు కొబ్బరి బొండాలను తరలిస్తున్నారని, వాటిని కొనుగోలు చేసి తమ దుకాణాల్లో అమ్ముతున్నట్లు విక్రయదారు వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో తెలిపారు.
ఒక్కో బోండాం రూ.40
జిల్లా కేంద్రంలో కొబ్బరి బొండాల ధరలు కూడా గ తంలో కంటే ప్రస్తుతం పెరిగాయి. గతంలో ఒక్కో కొబ్బరిబోండాం రూ.25 నుంచి రూ.30 చొప్పున అమ్మేవారు. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 వర కు ధర పలుకుతోంది. అదే కొబ్బరి నీరు ఒక లీటర్ బాటిల్ కొనాలంటే రూ.150 అవుతుంది. ఇతర శీత ల పానీయాల కంటే స్వచ్ఛమైన కొబ్బరినీరు తాగ డం ఆరోగ్యానికి మంచిదని భావించి ప్రజలు కొబ్బ రి బొండాలు సేవించడానికి ఇష్టపడుతున్నారు. అ నారోగ్యం పాలైన వ్యక్తులు, హాస్పిటల్లో ఇన్ పేషెంట్లుగా జాయిన్ అయినవారు కూడా కొబ్బరి బోండాలను సేవింప చేస్తున్నారు. దీంతో కొబ్బరి బొండాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.