జిల్లాకు చెందిన విద్యార్థులు మండల, జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రతిభ చూపారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా కథనం..
8లోu
సర్కారు చూసేదెప్పుడు..?
రెండేళ్ల క్రితం బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలికింది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల వలయాలను ఛేదించుకుంటూ గోడదూకి మరీ వర్సిటీలోకి వచ్చారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేదాకా పోరాడుతామని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్‌ఐటీపై దృష్టిపెట్టాలని రెండునెలలుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ.. ఇప్పటికీ ఎలాంటి స్పందన రావడం లేదు. మరోవైపు వర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారి సమస్యలూ అలాగే నలుగుతున్నాయి. పట్టింపులేని అధికారుల పర్యవేక్షణలో.. జైలును తలపించే నిబంధనల్లో.. విద్యార్థుల గోస బయటకు రావడం లేదు.