మహిళపై కారు ఎక్కించి హత్య

Woman Killed By Car Dispute Over Agricultural Land  - Sakshi

సాక్షి, మండ్య: రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యవసాయ భూమి గొడవలో మహిళ పైన కారు ఎక్కించి హత్య చేశారు. ఈ దారుణం మండ్య జిల్లాలోని నాగమంగళ తాలుకాలోని బెళ్ళూరు సమీపంలో ఉన్న గాణసంద్ర గ్రామంలో జరిగింది. బెంగళూరులో నివసించే గాణసంద్రవాసి రామకృష్ణయ్య భార్య జయలక్ష్మి (50) హతురాలు.  

పొలం పనులు చేయిస్తుండగా   
వివరాలు.. జయలక్ష్మీకి గత 10 సంవత్సరాల క్రితం గాణసంద్ర గ్రామంలో సర్వే నంబర్‌ 84లో బంజరు భూమిని ప్రభుత్వం ఇవ్వగా ఆమె సాగు చేస్తోంది. అయితే భూమి తమదని గౌడయ్య అతని కుటుంబ సభ్యులు అనేకసార్లు జయలక్షి్మతో గొడవ పెట్టుకున్నారు. బోర్లను కూడా ధ్వంసం చేశారు.

మంగళవారం జయలక్ష్మి బెంగళూరు నుంచి వచ్చి ట్రాక్టర్‌తో పొలం పనులు చేయిస్తుండగా గౌడయ్య, కుమారుడు అనిల్‌ సహా 8 మంది దాడి చేశారు. జయలక్ష్మి మీదకు అనిల్‌ కారుతో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ట్రాక్టర్‌ డ్రైవర్, కూలీలను కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

(చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top