ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..

Woman Dies Due To Extramarital Affair At Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. భర్త వివాహేతర సంబంధం కారణంగా నవ వివాహిత అత్తవారింట్లో మృతిచెందింది. ఈ ఘటన కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హందిగద్దె గ్రామంలో జరిగింది. 

వివరాల ప్రకారం.. ఏడు నెలల క్రితమే మృతురాలు యమున (20)కు విఘ్నేశ్వర గౌడ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే విఘ్నేశ్వర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయమై యమున భర్తతో నిత్యం గొడవపడేది. ఈ క్రమంలో మంగళవారం  ఉరివేసుకున్న స్థితిలో యమున శవమై తేలింది. అయితే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యమున తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేశారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top