ఇద్దరు పిల్లలున్నా వివాహేతర సంబంధం.. చివరకు ఇలా.. | Wife Commits Suicide Due To Extramarital Affair At Karnataka | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలున్నా వివాహేతర సంబంధం.. చివరకు ఇలా..

Oct 14 2022 7:15 AM | Updated on Oct 14 2022 7:22 AM

Wife Commits Suicide Due To Extramarital Affair At Karnataka - Sakshi

ఇద్దరు పిల్లలున్నా అక్రమ సంబంధం కారణంగా కుటుంబంలో..

కృష్ణరాజపురం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా భర్త పరాయి మహిళతో తిరగడంతో ఆవేదనకు లోనైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కృష్ణరాజపురంలోని రామ్మూర్తి నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో 8వ తేదీన జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న మహిళ చందా పురోహిత్‌ (35) కాగా, తల్లికి ఏమైందో తెలియక మృతదేహం వద్ద ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉండడం చూసి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు.  

రాజస్థాన్‌ నుంచి వలస వచ్చి..  
రాజస్థాన్‌కు చెందిన చందా పురోహిత్, భర్త నరేందర్‌ సింగ్‌లు బెంగళూరులో స్థిరపడ్డారు. 12 సంవత్సరాల క్రితం వీరికి పెళ్లి జరగ్గా.. 9, 4 సంవత్సరాల ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నరేందర్‌సింగ్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లేవాడు. అది తెలిసి భార్య స్థానిక పోలీసులకు మొరపెట్టుకోగా ఘరానా భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

అయినప్పటికీ  మారని భర్త.. మళ్లీ ప్రియురాలితో తిరుగుతూ ఉన్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే భార్యపై దౌర్జన్యం చేసేవాడు. నాటు తుపాకీతో బెదిరించేవాడని సమాచారం. ఇతని వేధింపులను తట్టుకోలేక ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. మరుసటి రోజు వరకూ పిల్లలు ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు ఏమైందో చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. చందా పురోహిత్‌ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి నరేందర్‌ సింగ్‌ను అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement