భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు

Viral: Groom Breaks Down in Tears Seeing His Gorgeous Bride in Wedding Dress - Sakshi

పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. 

వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్‌ వైర్‌ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ షేర్‌ చేసింది.
చదవండి: అఫ్గాన్‌ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు!

‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్‌ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్‌ పార్లమెంట్‌, వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top