వైరల్‌: బాబోయ్‌.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని!

Video: Man Travels On Bike With 12 Kids Goes Viral - Sakshi

ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌ వీడియోల హవా పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్లకు నచ్చడంతో అవి నెట్టింట దూసుకుపోవడంతో పాటు అందులోని వారు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు ఉన్నాయి. ఆ జాబితాలో కొన్ని వీడియోలు అనుకోకుండా జరుగుతుంటే మరికొన్ని వాటిలో మాత్రం వ్యూస్‌ , లైక్స్‌ కోసం ప్రాణాలకు రిస్క్‌ అయినా లెక్క చేయడంలేదు. అలా కొందరు వీడియోలు చేస్తున్నప్పుడు ప్రమాదంలో పడిన ఘటనలు మనం బోలెడు చూశాం.

తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై ప్రమాదకర ఫీట్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్‌పై 13 మంది చిన్నారులను ఎక్కించుకుని రోడ్డుపై దూసుకెళ్తున్నాడు. బైక్‌ సీట్లు, చక్రాలు.. అసలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చిన్నారులను కూర్చోబెట్టుకుని రయ్‌ అంటూ రోడ్డుపై షీకారుకు వెళ్లాడు. అంతేనా బైక్‌పై ప్రమాదకరంగా వేలాడుతున్న పిల్లలు ఏకంగా బచ్‌పన్‌కా ప్యార్‌ అంటూ పాటలు పాడుతూ ఆ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది వరకు ఉన్న చాలా వరకు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయ్‌, నవ్వించాయ్‌, కానీ ఇది మాత్రం వాళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇది చూసిన కొందరు ఏంటీ వెర్రిపనంటూ కామెంట్‌ పెడుతున్నారు.

చదవండి: Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top